Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
రేషన్ డీలర్‌ను వీధుల నుండి తొలగించాలని మండలపరిధిలోని వసంతపురం ఆవాసగ్రామమైన తెల్లబండతండావాసులు సోమవారం స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. రేషన్ దుకాణదారుడు అయిన శ్రీనివాస్ సమయపాలన పాటించకుండా తండావాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న తండా నుండి రేషన్‌షాప్‌కు రావాలంటే వద్ధులకు, వికలాంగులకు ఇబ్బందిగా ఉందన్నారు. సరైన సమయంలో రేషన్ బియ్యం ఇవ్వకుండా డీలర్ ఎదురువాదనలకు దిగుతున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు.ప్రతినెలలో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టిన అతన్ని ఇదేమిటని ప్రశ్నించినందుకు తండావాసులు మరొక సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే రేషన్ బియ్యం ఇవ్వబోమని ప్రజలను బెదిరిస్తున్నాడని తెలిపారు.ఇప్పటికైనా గ్రామంలో గల రేషన్ దుకాణంతో సంబంధం లేకుండా తండావాసులకు ప్రత్యేకంగా రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని తెలిపారు.