Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి :తను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకూ పని చేసిన బంటు రామస్వామి జీవితం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్యాకుబ్ అన్నారు.సోమవారం మండలంలోని రాయినిగూడెం గ్రామంలో బంటు రామస్వామి సంతాపసభ దోసపాటి భిక్షం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంటు రామస్వామి జీవితం ఆదర్శనీయమన్నారు.పేద కుటుంబంలో పుట్టినప్పటికీ నిజాయితీకి మారుపేరు రామస్వామి అన్నారు.వ్యవసాయ కూలి పెంపుకోసం, గీతకార్మికుల సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి అని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా ఎర్రజెండాయే మార్గమని చాటిచెప్పిన వ్యక్తి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామస్వామి, దోసపాటి భిక్షం, తుమ్మల సైదయ్య, జుట్టుకొండ వెంకటేశ్వర్లు, ఆర్.శ్రీనివాస్, గందెశేఖర్, సుధాకర్, మట్టయ్య, పఠాన్, మాజీ ఉపసర్పంచ్ గోపయ్య పాల్గొన్నారు.