Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
గ్రామపంచాయతీ కార్మికులె దుర్కుంటున్న సమస్యలను పరిష్కరి ంచాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు.సోమవారం మండలకేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో దామెర శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 నెలల నుండి కరోనా వైరస్ ప్రజలకు సోకకుండా ఫస్ట్లైన్లో ముందుండి పనిచేసిన కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు.మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, కనీసవేతనం రూ.19 వేలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. 8గంటల పని విధానం అమలు చేసి పనిభారం తగ్గించాలని కోరారు. అక్రమతొలగింపులు, వేధింపులు ఆపాలని, ఆదివారం సెలవు, పండగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల సాధికారిత అఖిలపక్ష మీటింగ్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు, పీఆర్సీ వర్తింపచేయాలని అడిగిన ప్రశ్నకు సీఎంకేసీఆర్ వేతన పెంపు హామీ మేరకు వెంటనే జీఓ విడుదల చేయాలని ఆదేశాలి చ్చారన్నారు.ఈ సమావేశంలో ఆ గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ మండల కార్యదర్శి తిరుమణి శ్రీనివాస్, సభ్యులు గాదెపాక మరియమ్మ, అబ్బనబోయిన వెంకటయ్య, ఆర్.ఎల్లయ్య, జి.లక్ష్మమ్మ, నస్సమ్మ ,బి.లక్ష్మయ్య, భిక్షమయ్య, జె.వేలాద్రి, జె.నర్సింహ, రాములు, జానకమ్మ పాల్గొన్నారు. మర్రిగూడ : గ్రామపంచాయతీ వర్కర్లకు ఆదివారం సెలవు పండుగ రోజు సెలవులతో పాటు వెంటనే ఎస్కేడే బీమా అమలుచేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం సీఐటీయూ మండల అధ్యక్షులు వట్టిపల్లి హనుమంతు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజంభిస్తున్న సెకండ్ వేవ్‌లో సైతం ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తే కార్మికులకు వేతనాలను పెంచలేదని విమర్శించారు.కనీస వేతనం రూ.19 వేలు నేటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయకపోగా ఎనిమిది గంటల పని విధానం పట్టించుకోకపోవడం, పని భారం ఎక్కడ తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ తొలగింపులు, వేధింపులు తగ్గుముఖం పట్టకుండా నానాటికి పెరుగుతున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఊరిపక్క లింగయ్య,పెరుమాళ్ల మంజుల, ఎడ్ల అంజయ్య, ఊరిపక్క వెంకటయ్య, పోలేపల్లి రాములు, నక్క నర్సింహ, యాచారం రమేశ్, యాదగిరి, అనిమల్ల ముత్యాలు, గిరి నర్సింహ, భారతమ్మ, ఆకారం నర్సింహ, హసీన్, ఏరుకొండ లక్ష్మయ్య పాల్గొన్నారు