Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మధ్యాహ్న భోజన కార్మికులెదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు డాక్టర్ మల్లుగౌతమ్రెడ్డి కోరారు. మంగళవారం ఈవిషయమై సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీనాయక్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.మధ్యాహ్నభోజన కార్మికులకు పనికితగ్గ వేతనం అందడం లేదని విమర్శించారు. వారితో ప్రభుత్వాలు వెట్టి చేయించుకుంటున్నాయని విమర్శించారు. కరోనా సమయంలో విద్యాసంస్థలు గడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని,వెంటనే వారిని ఆదుకోవాలని కోరారు.కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు.పీఆర్సీ వర్తింపజేసి న్యాయం చేయాలన్నారు. పెండింగ్లోనున్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పాఠశాలను ప్రారంభించి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.అప్పటివరకూ ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బి.పార్వతి, కార్మికులు ఎం.మంగ, డి.కరుణ, పద్మ, ప్రియాంక, డి.పద్మ, జైనాబి పాల్గొన్నారు.