Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేటను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి 10వ తేదీ వరకూ నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ వార్డు అధికారులతో మెప్మా సిబ్బంది భాగస్వామ్యమై పారిశుధ్య నిర్వహణ, మురుగు కాలువలు శుభ్రం, రోడ్ల వెంట కంప చెట్ల తొలగింపు, వీధిలైట్ల ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించి హరిత పట్టణంగా తీర్చి దిద్దాలన్నారు. వార్డుల్లో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, మెప్మా పీడీ రమేశ్ నాయక్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.