Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
సమిష్టి కృషితో మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని మున్సిపల్ చైర్మెన్ చందమళ్ల జయబాబు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 2,3,8,9, వార్డుల్లో నెలకొన్న నీరు, డ్రయినేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మిషన్ భగీరథ ఏఈ మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద 2226 ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్తవి వేస్తామని విద్యుత్ ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ చల్లా శ్రీలతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, కౌన్సిలర్ కొనతం చినవెంకట్‌రెడ్డి, రణపంగ నాగయ్య, షేక్ భాష, బచ్చలకూరి ప్రకాష్, జితేందర్‌రెడ్డి, సాయి, నూకల సుగుణమ్మ, అలక సరిత, లలిత, షహనాజ్, కొదమగుండ్ల సరిత, నాగవేణి, సులోచన, మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.