Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కోవిడ్‌ను జయించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రఆస్పత్రిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 14వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రజలు వెన్నంటి ఉండి ఆదుకునే పార్టీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కరోనా కష్టకాలంలో కూడా సీపీఐఎం కార్యాలయంలో ఐసోలేషన్ సెంటర్ పెట్టి, ప్రభుత్వ దవాఖానలో 14వ రోజులుగా అన్నదానం చేస్తుండడాన్ని అభినందించారు.ఎన్ని విపత్తులు వచ్చినా ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు.దేశంలో 3వ సారి కరోనా విజంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వాలు తమ బాధ్యతలు నెరవేర్చడం లేదన్నారు.ప్రజలంతా మాస్కులు ధరించడంతో పాటు సామాజికదూరం పాటించాలన్నారు.సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌హాషం మాట్లాడుతూ తాము చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.తమవంతుగా ఐసోలేషన్, సహాయక కేంద్రాలు పెట్టి ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎండిసలీం, పుచ్చకాయలనర్సిరెడ్డి, బ్రహ్మచారి, శోభన్‌బాబు, భూతం అరుణకుమారి, ఝాన్సీ, రేణుక, అలేఖ్య పాల్గొన్నారు.