Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, శాసన సభ్యులు, మున్సిపల్ చైర్మెన్, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్షించారు. వచ్చే నెల 1 నుంచి 10 రోజుల పాటు అన్ని వార్డుల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను అభివద్ధి కమిటీలలో సభ్యునిగా నియమించి, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, కుటుంబాలనుంచి సంతకాలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. వెజ్ , నాన్ వెజ్ మార్కెట్లకు సంబంధించి ఎకరం విస్తీర్ణంలో స్థలాన్ని వెంటనే గుర్తించి అందుకు అనువైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పట్టణంలోని ట్రాక్టర్లతో, ర్యాలీలతో రోజువారి చెత్తను సేకరణ చేయాలన్నారు. చైర్మన్లు, కౌన్సిలర్లు వార్డుల వారీగా సమావేశాలు జరిపి చెత్తాచెదారం తొలగించడం పై, సేకరించడం పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. . వార్డుల్లో వేలాడ విద్యుత్ వైరు, దెబ్బతిన్న పోల్స్‌ను ట్రాన్స్‌కో అధికారులు తొలగించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్మెన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.