Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేని ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర, వెంకన్న, జెడ్పీటీసీ కన్నా సూరంభవీరన్న, వైస్ ఎంపీపీ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామంలో పలు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గుమ్మడవెళ్లి గ్రామం గతంలో ఎలాంటి అభివృద్ధికీ నోచలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీలకతీతంగా గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ.రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర వెంకన్న, జెడ్పీటీసీ కన్నా సురాంభ వీరన్న, వైస్ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ వల్లపు యాకన్న యాదవ్, ఆకుల ఉప్పలయ్య, తహశీల్దార్ మన్నన్, ఎంపీడీవో సరోజ, సీడీపీవో శ్రీజ తదితరులు పాల్గొన్నారు.