Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి కోరారు. మంగళవారం మండలంలోని అనంతారం గ్రామంలో ఆయన పర్యటించారు. నర్సరీల పెంపకం, వైకుంఠధామం , పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడంతో పాటు ఆ మొక్కలు నాటేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డుకు, వైకుంఠధామం వద్ద కొన్ని రకాల చెట్ల బయో పెన్సింగ్ చేపట్టాలని కోరారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం చేరుకొని గతంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పనులు ,గ్రామ పరిస్థితిపై రూపొందించిన డాక్యుమెంటరీని, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఎంపీడీవో నాగిరెడ్డి, సర్పంచ్ చందం మల్లికార్జున్ , ఎంపీటీసీ సామల వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, ఉపాధి హామీ ఏపీఓ బాలస్వామి ఉన్నారు.