Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
2013లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎస్సీ సెల్ ప్రధాన పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మెన్ ఆదిమల్ల శంకర్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.త్వరలోనే గ్రామ, మండల, జిల్లాస్థాయి ఎస్సీసెల్ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేశామన్నారు.తన ఎన్నికకు సహకరించిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతంకు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డికి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డికి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్యకు,డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్‌కు,మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌కు,గుమ్ముల మోహన్‌రెడ్డికి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి,ఎస్సీ సెల్ కార్యకర్తలకు కతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు పెరిక అంజయ్య, దుబ్బ మధు, బోడస్వామి, కొత్తపల్లి మధు, ఇరిగి శంకర్, పెరిక మనోహర్, కిన్నెర నగేష్, తలారిసైదులు,కొప్పుల సైదులు, గంటగుండ్ల సురేష్ పాల్గొన్నారు.