Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
సీఎంకేసీఆర్ ప్రారంభించిన మిషన్‌భగీరథ ప్లాంట్ పిచ్చి మొక్కలతో నిండి ఉంది.రాష్ట్రంలో ఏడో విడత హరితహారం కార్యక్రమం పనులు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.కానీ మండలపరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో సుమారు ఐదెకరాల స్థలంలో ఉన్న మిషన్‌భగీరథ వాటర్‌ప్లాంట్ పిచ్చిమొక్కలతో నిండి ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మిషన్‌భగీరథ వాటర్‌ప్లాంట్‌లో ఎక్కడ చెత్త అక్కడే దర్శనమిస్తున్నాయి. చివ్వెంల, ఆత్మకూర్ (ఎస్),పెన్‌పహాడ్ మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథవాటర్ను అందిస్తున్న ఈ ప్లాంట్ ఆవరణంలో మొత్తం పిచ్చిమొక్కలతో అశుభ్రంగా ఉంది.అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథలోనే ఇంత అశుభ్రంగా ఉంటే ప్రజలకు సురక్షితమైన మంచినీటిని ఎలా అందిస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవికాలంలో రోజుల తరబడిగా గ్రామాలకు నీరందించడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. నీళ్లు రావడం లేదని అడిగితే రహదారి నిర్మాణపనులలో పైపులు పగిలాయని సాకులు చెబుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.మిషన్ భగీరథ ప్లాంట్‌పైన ప్రత్యేక అధికారులు లేక ఈ వాటర్‌ప్లాంట్ కొంతమంది కాంట్రాక్టర్ల కనుసైగలతో ఇష్టం వచ్చిన రీతిలో నడుస్తుందనే ఆరోపణలున్నాయి.ఇకనైనా అధి కారులు స్పందించి మిషన్ భగీరథ వాటర్‌ప్లాంట్ పరిసరప్రాంతాలను శుభ్రం చేయించడంతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటించి ఉద్యాన వనం లాగా తయారు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పలువురు కోరుతున్నారు.