Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మందుల సామెల్
నవతెలంగాణ- అడ్డగుడూర్
ఉమ్మడి జిల్లాలోనే 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అతిపెద్ద గిడ్డంగులను నిర్మించుకోబోతున్నామని, మండలంలోని చౌళ్ల రామారం గ్రామశివారులో ఐదెకరాల్లో రూ.11 కోట్ల వ్యయంతో జూలై 1వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మందుల సామెల్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , విద్యుత్ శాఖ మంకనతి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి , ప్రభుత్వ విప్ గొంగడి సునీత, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ ,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,రైతు సమన్వయ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి , స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరుకానున్నట్టు తెలిపారు. దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి సీఎం ఇటీవల అఖిలపక్షంతో సమావేశం నిర్వహించారన్నారు. ఇంటికి పది లక్షల చొప్పున ఇస్తామనడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాడోజు లక్ష్మణాచారి, సర్పంచ్ శీలం జ్యోతి రాములు, మాజీ ఉప సర్పంచ్ కప్పలవెంకన్న, రైతు కో -ఆర్డినేటర్ భాల్నే వెంకన్న, యూత్ అధ్యక్షులు మందుల సైదులు తదితరులు పాల్గొన్నారు.