Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
దళిత సాధికారత పథకానికి రూ.1200 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ మండల కేరద్రంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లకుమళ్ల జ్యోతిభిక్షం, జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, మార్కెట్ చైర్మెన్ ఇంజమూరి యశోద రాములు మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నిరుపేద దళిత ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉప అధ్యక్షుడు వస్కుల సుదర్శన్, కల్లూరు సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, కల్లూరు ఎంపీటీసీ నాగవేణి గురవయ్య, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి నందిపాటి హిందూజా, ఎస్సీ సెల్ మండల ఉప అధ్యక్షుడు చిట్యాల వినోద్‌కుమార్, నాయకులు కత్తి అనిల్, బట్టు నాగరాజు, యడవెళ్లి సైదులు, కనక రాజుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : దళితుల సాధికారత స్కీమ్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళిత సాధికారత స్కీమ్‌తో దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరి లక్ష్మయ్య, కందుకూరి ప్రవీణ్, పత్తేపురం సరిత, నరేష్, రమేష్, త్రిశూల్, రంజిత్, లింగన్న, పవన్ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : మండల పరిధిలోని మాధవరాయగూడెం గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు చిట్యాల అమర్నాథ్రెడ్డి, బెల్లంకొండ అమర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు గంగరాజు సతీష్, మాజీ కౌన్సిలర్, నందిగామ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.