Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
పలువురు బాధితు లకు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మంగళ వారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం లాంటిదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం మండల పరిధిలోని సోమలతండాలో జరుగుతున్న కమ్మ పండగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొన్న మల్లయ్య యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.