Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి
నవతెలంగాణ -తుర్కపల్లి
ప్రతి ఇంటి బిడ్డను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వీరారెడ్డిపల్లి ,మాదాపూర్ గ్రామంలో రైతు వేదికను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా మొక్కలు నాటారు. లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు వేదికను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మెన్ బీకు నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరెందర్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవిందర్ గౌడ,్ ఎంపీపీ భుక్య సుశీలరవిందర్ నాయక్, గ్రామ సర్పంచ్ జక్కల శ్రీవాణివెంకటేష్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ , ఏఈఓ దుర్గేశ్వరీ, పీఏసీఎస్ చైర్మెన్ నాగాయపల్లి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి అద్యక్షులు కోంశెట్టి నర్సిహులు , ఎంపీటీసి కానుగంటి శ్రీనివాస,్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు పలుగుల నవీన్, గిద్దె కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.