Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డేపల్లి చూపు మరలా తుంగతుర్తి వైపు
- ఆయన సేవలను మరవని
- నియోజకవర్గ ప్రజలు
- రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవితో
- వైద్యునికి కొత్త జోష్
సరైన నాయకుడి కోసం కాంగ్రెస్ కార్యకర్తల ఎదురుచూపు
నవతెలంగాణ - సూర్యాపేట
పట్టణానికి చెందిన వడ్డేపల్లి రవి సీనియర్ వైద్యులు. ఆయన సేవలను వినియోగించుకోలేని వారు దాదాపు ఆ నియోజకవర్గంలో ఉండకపోవచ్చు. కేవలం వైద్య వత్తిలోనే కాక రాజకీయ రంగంతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు శతాబ్దాలకు పైగా వైద్య వత్తి, శతాబ్దానికి పైగా రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. లేజర్ కంటి ఆస్పత్రి నిర్వాహకులుగా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారు. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికీ ఏదో ఒక రూపంలో సహాయ, సహకారాలు అందించిన వ్యక్తిగా ఆయన పేరొందారు. అందుకే ఆ ప్రాంతానికి ఆయనంటే చాలా గౌరవం.
గడిచిన పర్యాయం అసెంబ్లీ ఎన్నికల ముందు దాదాపు ఆయనే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు భావించారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ రిజర్వుడ్ స్థానం నుంచి ఆయనకు పార్టీ టికెట్ రాలేదు. దీంతో ఆయన కొంతకాలం పాటు ఆ నియోజకవర్గ ప్రజలకు దూరం అయ్యారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఆయన ఆ పార్టీని వదిలి గులాబీ పార్టీలో చేరారు. అందర్నీ కలుపుకుపోయే గుణం ఉన్న ఆయనకు పార్టీ ఆశించిన రీతిలో హోదాకి తగ్గట్టు పదవులు ఇవ్వలేదు. దీంతో కొంత నిరాశ, నిస్పహలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఈ దశలోనే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నిక కావడంతో ఆ పార్టీకి కొత్త జోష్ రావడంతో డాక్టర్ చూపు తిరిగి కాంగ్రెస్ వైపు మరలినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితమే ఆయన రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్టు తెలిసింది.
తుంగతుర్తికి సరైన నాయకుడు వడ్డేపల్లి నేనట
జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గ వర్గానికి పోరాటాల గడ్డగా పేరున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకపోవడం ఆ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటుగా మిగిల్చింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు మకాం మార్చినప్పటి నుంచి అక్కడ ఒక ప్రత్యేక నాయకుడిగా బాద్యతలు మోస్తున్న సరైన వ్యక్తి లేడనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ దామోదర్‌రెడ్డి పేరుతోనే ఆ నియోజకవర్గ ప్రజలు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన అనుచరుడిగానే ఉన్న వడ్డేప్లలి రవి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. అప్పటి వరకు ఈ డాక్టర్ తుంగతుర్తి నియోజకవర్గ పరిధి మొత్తం తన సొంత అభిమానాన్ని చూరగొట్టుకున్నాడు. ఆయన పార్టీ మార్పు దృష్ట్యా తుంగతుర్తికి దూరం అయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ పార్టీ బాద్యతలను ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మోసుకుంటూ వస్తున్నారు. అయిన్పపటికీ గతంలో ప్రజలతో ఉన్న సంబంధాలతో వడ్డేపల్లి రవి తుంగతుర్తి వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వీరంతా కూడా దామోదర్‌రెడ్డి గ్రూపుకు చెందిన వారే కావడం గమనార్హం.
నిత్యం ప్రజాసేవలో ఉండడమే డాక్టర్‌కి ఇష్టం కాబోలు..
వైద్య సేవలతో పాటు డాక్టర్ వడ్డేపల్లి రవికి రాజకీయ రంగంపై కూడా విశేషమైన ప్రీతి ఉన్నట్టు పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. ప్రజా సేవే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. ఆయనపై ఉన్న అభిమానాన్ని చూరగొన్న వ్యక్తులు నియోజకవర్గంలో కోకొల్లలు. ఆయన ఎలాగైనా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే తన మనస్సు మార్చుకుని తిరిగి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే స్థానిక నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ బలం ఆయనకు ఎలా ఉంటుందనేది నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విశ్వాసంగా కన్పిస్తోంది.