Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - నేరేడుచర్ల
కృష్ణా జలాల పంపకం విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, మంత్రులు వివాదంగా మారుస్తున్నారని..వివాదం పరిష్కారం కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానది జీవనది అని దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సగం జనాభాకు తాగు, సాగునీరు అవసరాలు అందుతుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరపాలన్నారు. ఇందులో సీడబ్య్లూసీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇరు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రకారం ఏ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొన్ని విషయాల్లో తీర్పునిచ్చిందన్నారు. నేడు ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీ సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ నీటిని ఉపయోగించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన సాగిస్తుందని తెలిపారు. తెలంగాణలోని మహబూనగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ప్రధానమైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పోలీసు బలగాలను పెట్టి నీళ్లు, పవర్ జనరేషన్ కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఇద్దరు సహాయం చేసుకునే వారని, ఇప్పుడు సెంటిమెంటును ప్రేరేపిస్తూ ఉభయ రాష్ట్రాల్లో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి యాదగిరిరావు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల సీపీఐ(ఎం) కార్యదర్శులు కొదమగుండ్ల నగేష్, కందగట్ల అనంత ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.