Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వేంల
తమకు భూమి అమ్మిన వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఎస్సై లాక్కున్న సంఘటన గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు పిడమర్తి సునీత వివరాల ప్రకారం..సూర్యాపేట పట్టణానికి చెందిన పిడమర్తి సునీత 04/09/2019లో చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టపెంజర వీరయ్య వద్ద సర్వే నెంబర్ 300/రు/2 లో 0.11 కుంటల భూమిని కొనుగోలు చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ (2602/2019)ద్వారా పట్టా పొంది పాస్ బుక్ కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఆ భూమిపై పిడమర్తి సునీత కబ్జా, కాస్తు కలిగి ఉండగా దురాజ్‌పల్లికి చెందిన పొట్టపెంజర వీరయ్య ఆ భూమి ముందు హోటల్ పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం బాధితురాలు సునీత దురాజ్‌పల్లిలోని తన భూమి వద్దకు వెళ్లి హోటల్ తీయాలని వీరయ్యను కోరింది. ఈ క్రమంలో వీరయ్య బాధితురాలు సునీతపై దాడి చేసి బూతులు తిట్టాడు. చంపుతానని కూడా బెదిరించాడు. దీంతో ప్రాణభయంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనపై జరిగిన దాడి గురించి స్థానిక పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. అక్కడే ఉన్న ఎస్సై తన సెల్‌ఫోన్ గుంజుకున్నారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా వీరయ్యకు ఫోన్ చేసి నీపై ఎవరో ఫిర్యాదు చేస్తున్నారని, నువ్వు కూడా వచ్చి కేసు పెడితే వాళ్ల మీద కూడా కేసు నమోదు చేస్తానని చెప్పారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది.