Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
- పొనుగోడులో సుందరి లింగమ్మకు నివాళులు
నవతెలంగాణ-గరిడేపల్లి
తెలంగాణ రైతంగ సాయుధ పోరాట సమయంలో ఈ ప్రాంతంలో తన భర్త సుందరి బసవయ్యతో కలిసి ఆయన సతీమణి సుందరి లింగమ్మ అనేక ఉద్యమాలు చేసిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పొనుగోడు గ్రామంలో సుందరి లింగమ్మ మృతదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరి బసవయ్యను కొందరు కాంగ్రెస్ గూండాలు అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి హత్య చేశారన్నారు. ఆయన మృతి తర్వాత కూడా ఆయన సతీమణి ఏమాత్రం వెనకడుగు వేయకుండా పార్టీనే ఊపిరిగా భావించి ఆ గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు షేక్ యాకుబ్, పారేపల్లి శేఖర్‌రావు, కందగట్ల అనంత ప్రకాష్, నగేష్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుజాత శ్రీనివాస్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు జోగు అరవింద్ రెడ్డి, తుమ్మల సైదులు, జుట్టుకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం సుందరి లింగమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు.