Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించాలి
- జాతీయ డీఎంటీ బోర్డు సభ్యులు తురక నర్సింహ
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో సంచార జాతుల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జాతీయ డీఎంటీ సభ్యులు తురక నర్సింహాకోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంచార జాతుల జీవన శైలి, వారి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులను సామాజికంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులు వారికి చెందేలా చూడాలని సూచించారు. సంచార జాతుల పిల్లలను విద్యలో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.20 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నదని, రాష్ట్రాలు ఎకనామికల్ సపోర్ట్ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు ఉపేంద్ర, శిరీష, దయానందరాణి, డీఎంఅండ్‌హెచ్‌వో కోటాచలం, వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, వివిధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.