Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నవతెలంగాణ - తిరుమలగిరి
పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పట్టణాలు, పల్లెలు సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీలో పరిధిలోని 13వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో, పల్లెల్లో గుణాత్మక మార్పు వచ్చిందని చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తమ వార్డులు బాగు చేసుకోవడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదం కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పూల వనంగా మారిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం మంత్రి 13 వార్డుల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోతురాజు రజనీరాజశేఖర్, వైస్ చైర్మెన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ మూల అశోక్‌రెడ్డి, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, జెడ్పీటీసీ దూపటి అంజలి, రవి, పీఏసీఎస్ చైర్మెన్ పాలేపు చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.