Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీచైర్మెన్ బండా నరేందర్ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్పల్లి
ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించి గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని జెడ్పీచైర్మెన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మాండ్ర గ్రామంలో జిల్లా పరిషత్ సహజ నిధి నుంచి చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. హరితహారంలో భాగంగా ప్రకతి వనంలో మొక్కలు నాటి ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.2.53 లక్షలతో 11కేవీ విద్యుత్ లైన్ మార్పిడి కార్యక్రమం , జిల్లా పరిషత్ సహజ నిధులతో చేపట్టిన రూ.1.38 లక్షలతో యాదవుల పెద్దమ్మ దేవాలయానికి నూతన కరెంట్ లైన్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు బైరెడ్డి కర్ణకర్ రెడ్డి ఎంపీటీసీ లు, పుల్లెంల ముత్తయ్య ,మేకల రాజి రెడ్డి ,దుబ్బాక పావని శ్రీధర్ ,సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ ,అధికారులు ఎం ఎస్ వో చరిత , ఎంపీడీవో సాంబశివరావు , ఏపీవో యాదయ్య ఏ ఈ లక్ష్మయ్య , నాయకులు బోయపల్లి శ్రీనివాస్,వార్డు మెంబర్లు,మేకల కర్ణాకర్ రెడ్డి , నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.