Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
దళితులను అన్ని రంగాల్లోనూ అభివద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం దళిత వాడల సందర్శన కార్యక్రమంలో భాగంగా మండలంలోని పులిపలుపుల, కల్వలపల్లి, గూడపూర్, కొరటికల్ గ్రామాలను ఆయన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్తతో కలిసి పర్యటించారు .అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత ప్రజల అభ్యున్నతి కోసం రూ.1200 కోట్ల రూపాయలను కేటాయించిందని, దళిత సాధికారత అభ్యున్నతి కోసం కేసీఆర్ పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి ,ఎంపీపీ కర్నాటి స్వామి , మండల కోఆప్షన్ సభ్యులు ఎండీరఫీక్ , జిల్లా నాయకులు లాల్‌బహదూర్ గౌడ్ ,మండల సీనియర్ నాయకులు బొల్గూరి నరసింహ , చండూరు మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకట్ రెడ్డి , ఎంపీటీసీ సభ్యులు వంటెపాక వెంకటమ్మ వెంకన్న , బీరప్ప లక్ష్మమ్మ, సర్పంచులు పందుల మారయ్య , కంచి జ్యోతి ప్రసాద్ , వల్లూరి పద్మ లింగయ్య , ఓయూ విభాగం యువజన నాయకులు శిరగమళ్ల కిషోర్ , దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.