Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన రైతు రాచకొండ శ్రీనివాస్ గురువారం భువనగిరి డీసీపీ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. జూన్ 23న గుజ్జ గ్రామానికి చెందిన ఉప్పలపల్లి యాదయ్య ఆ కారణంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే రోజు నారాయణపురం ఎస్ఐకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో భువనగిరి డీసీపీకి తిరిగి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. గుజ్జ గ్రామ పరిధిలోని ముక్కిడిజాం బారు గూడెం పరిసర ప్రాంతంలో గల తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ప్రభుత్వం గతంలో రోడ్డు నిర్మించింది అన్నారు. ఈ రోడ్డు వెంట తన మోటార్ సైకిల్‌పై వెళుతుండగా ఉప్పల పెళ్లి అనే వ్యక్తి ప్లాన్ ప్రకారం తనను చంపేందుకు మోటార్ సైకిల్ అడ్డగించి కర్రతో తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా గొడ్డలితో వెంబడించారని పేర్కొన్నారు. వెంటనే అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కోరారు.తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎస్ఐవివరణ :మల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన రాచకొండ శ్రీనివాస చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 23న నే ఉప్పలపల్లి యాదవ్ పై కేసు నమోదు చేశాను. జూన్ 30న హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి నల్లగొండ కోర్టుకు రిమాండ్ చేశాను.ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునేందుకు రాచకొండ శ్రీనివాస్‌కు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించడం లేదు.