Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -వలిగొండ
పేద ప్రజల మనిషిగా మండల ముఖ్య నాయకుడిగా ఎదిగి సీపీఐ(ఎం) ఉద్యమాన్ని విస్తతం చేయడం కోసం వేముల మహేందర్ నిరంతరం కషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్తా కషి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం స్థానిక శివ సాయి ఫంక్షన్ హాల్లో వేముల మహేందర్ సంతాప సభ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మహేందర్ ప్రజల్లో విశ్వాసం కలిగిన నాయకుడిగా నిలిచారన్నారు. చిన్నతనం నుండిప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేశాడన్నారు. ప్రజా ఉద్యమాల్లో అనేక సమస్యలు, కష్టనష్టాలు వచ్చిన తన చివరి శ్వాస వరకు ఎర్రజెండాను వదలకుండా పోరాటాలు చేశారని కొనియాడారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండ.ి జహంగీర్ మాట్లాడుతూ జిల్లా ఉద్యమానికి మహేందర్ లేని లోటు తీర్చలేనిన్నారు. వ్యవసాయ కార్మిక సంఘంలో భూ సమస్యలపై కీలక పాత్ర పోషించి ఎన్నో సమస్యల పరిష్కారానికి కషి చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగా నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం ,దోనూరి నర్సిరెడ్డి, బట్టుపల్లి అనురాధ, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య ,జిల్లా కమిటీ సభ్యులు స్వామి, తుర్కపల్లి సురేందర్ ,గాజుల అంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, కందాడి సత్తిరెడ్డి ,శ్రీశైలం రెడ్డి, ముత్యాలు, యాదయ్య ,ఏలే కష్ణ, కొమ్మిడి లక్ష్మారెడ్డి, మహేందర్ కుటుంబ సభ్యులు భార్య లలిత, కుమారుడు జ్యోతి బాబు, కూతురు చైతన్య, తమ్ముడు అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.