Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ మానవహక్కుల కమిషన్ బోర్డు సభ్యులు నర్సింహా
నవతెలంగాణ - కోదాడరూరల్
సంచార జాతులు, వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన్ బోర్డు సభ్యులు తురక నర్సింహా కోరారు. శుక్రవారం పట్టణంలోని అనంతగిరి రోడ్డులో గల చెరువు పక్కన గుడిసెలు వేసుకొని నివాసముంటున్న బుడగ జంగాల వారిని, లక్ష్మీపురం కాలనీలో గంగిరెద్దు కులాల వారిని కలిశారు. వారి జీవన విధానాలు, స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో సంచార జాతులను ఏ విధంగా ఆదుకున్నారో అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నిధులు వారికి అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో సంచార జాతుల వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్, డీఐవో వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్ శైలజ, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉపేందర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, మమత, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.