Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బహదూర్ పేట్లో శుక్రవారం ఆలేరు రైతు ఉత్పత్తి దారుల సంఘం బ్రోచర్‌ను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరూ ఎఫ్పీఓలో చేరి సంఘటిత మై సమస్యలను పరిష్కరించు కోవచ్చని తెలిపారు. నాబార్డ్ గుర్తించిన ఎఫ్పీఓలో సభ్యులుగా చేరితే అనేక ప్రయోజనాలు(కస్టమ్ హైరింగ్ సెంటర్, లోన్స్, వ్యాపారం చేసుకొనికి ఫ్రీ గ్రాంట్) ఉన్నాయన్నారు. రైతుల సంఘటిత శక్తితో ప్రగతిని సాధించవచ్చన్నారు. మున్సిపల్ చైర్మెన్ శంకరయ్య మాట్లాడుతూ ఎఫ్పీఓలో ప్రతి ఒక్క రైతు సభ్యునిగా చేరి ప్రభుత్వ పథకాలను ,సేవలను ప్రత్యేకంగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్్ లావణ్య లత, మేనేజర్ సుమిత, కౌన్సిలర్స్ రాయపురం నర్సింహా, బేతి రాములు,ఫ్యాక్స్ డైరెక్టర్ కుల్లా సిద్ధులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, నాయకులు మొరిగాడి వెంకటేష్, వట్టిపల్లి లక్ష్మణ్, కుండే సంపత్ కుమార్, గ్రామవికాస్ సంస్థ డైరెక్టర్ వస్పరి స్వామి , వస్పరి బాలయ్య, కుల్ల సంపత్, బండ్రు రాజమల్ల య్య, పల్లె నర్సయ్య , రైతులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
పట్టణ పురోగతిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. పట్టణకేంద్రంలోని 6వ వార్డు బహదూర్‌పేటలో శుక్రవారం చైర్మెన్ వస్పరి శంకరయ్య అధ్యర్యంలో పట్టణ ప్రగతి భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోతహసీల్దార్ గణేశ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ లావణ్య లత, మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు వట్టిపల్లి లక్ష్మణ్, కౌన్సిలర్ లు రాయపురం నరసింహులు , బేతి రాములు, సింగల్ విండో డైరెక్టర్ కుళ్ళ సిద్దులు, కుండే సంపత్, వస్పరి బాలయ్య, దొంతుల ఎల్లేష్, కుళ్ళ సంపత్, కుళ్ళ శ్రీశైలం, అంకిరెడ్డి కష్ణ, ఎండీ ఫయాజ్ ,తదితరులు పాల్గొన్నారు.