Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
నవతెలంగాణ-మోత్కూరు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో పట్టణ ప్రగతిని నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని స్థానిక సంస్థల యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మోత్కూరుమున్సిపాలిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు గంటకు పైగా పట్టణంలోని మెయిన్ రోడ్లు, వీధుల్లో తిరిగి పారిశుధ్యం, మురుగు కాల్వలను పరిశీలించారు. నిరుపయోగంగా ఉన్న పబ్లిక్ టారు లెట్లను వాడకంలోకి తీసుకరావాలని సూచించారు. పట్టణం మధ్య నుంచి పెద్ద చెరువులోకి వచ్చే బందావన్ కాల్వఅపరిశుభ్రంగా ఉండటం చూసి దాన్ని శుభ్రం చేయించాలని, దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటాలని, నాటిన మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. పన్నుల వసూలు, ఇండ్ల నిర్మాణ అనుమతులు, ఆదాయ, వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ చైర్పర్సన్తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఆయన వెంట వైస్ చైర్మెన్ బి.వెంకటయ్య, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కమిషనర్ షేక్ మహమూద్, మేనేజర్ జె.ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్, మార్కెట్ మాజీ చైర్మెన్ తీపిరెడ్డి మేఘారెడ్డి తదితరులు ఉన్నారు.