Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -రాజాపేట
ఏండేండ్ల నుండి గంధమల్ల ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఎన్నో ప్రకటనలు చేసి ఇంతవరకు ప్రారంభించలేదని, అసలు ప్రాజెక్టు ఉన్నదా లేదా ప్రకటించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుకు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎన్ని టీఎంసీలు ఉంటుందో స్పష్ట ఇవ్వాలన్నారు. రాజాపేట మండలకేంద్రంలో జూనియర్ కాలేజీ హాస్పిటల్ , గుట్ట నుండి సింగారం బార్డర్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్డును ప్రస్తుతం గుంతల మయంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలోని చాలా కుటుంబాలు బొంబాయి, హైదరాబాద్ మస్కట్ లాంటి ప్రాంతాలకు వలసెళ్లి జీవనం కొనసాగిస్తు న్నాయన్నారు. వలసలను అరికట్టేందుకు ఉపాధి చూపించాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్, స్థానిక నాయకులు సిల్వర్ బాలరాజ్‌గౌడ్ కత్తుల అంజిరెడ్డి, ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి బొద్దుల నగేష్ ,ఐరేని నవీన్ కుమార్, ఎస్టీసెల్్ జిల్లా నాయకులు రాంజీ నాయక్ ,బస్వరాజ్ ,ఉప్పలయ్య ,లక్ష్మణ్ పాల్గొన్నారు.