Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని 9,8వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పట్టణాల సమగ్రాభివద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోయా యన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని ఆయన కోరారు. కలిసి కట్టుగా ముందడుగు వేసి చెత్త రహిత పట్టణంగా మారుద్దామన్నారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. మన ఆరోగ్యం మనమే కాపాడు కోవాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, పట్టణప్రగతి అధ్యక్షుడు హన్మంత్ వెంకటేష్‌గౌడ్, వైస్‌చైర్మెన్ రహత్ అలీ, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య, మాజీ చైర్మెన్ వాడిత్య దేవేందర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, మూడావత్ జయప్రకాష్ నారాయణ, పొన్నబోయిన సైదులు, చిత్రం ప్రదీప్, కమిషనర్ వెంకటయ్య, బొడ్డుపల్లి కష్ణ, జింకల లింగయ్య, హన్మంత్ సాయి, రమేష్, అజరు, అభి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే పురాభివద్ధి
మిర్యాలగూడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణలో ముందంజలో ఉన్నామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఉద్ఘాటించారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముత్తిరెడ్డికుంట(19వ వార్డు), సుందర్‌నగర్(37వ వార్డు )కాలనీల్లో సీసీరోడ్ల నిర్మాణపనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.పట్టణ ప్రగతిపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణాభివద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు.అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు.మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీలో జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు,మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, కౌన్సిలర్ పత్తిపాటి నవాబ్, దేవతమ్మ అయోధ్య, నాయకులు జోజి, బల్లెం శివరాం, సంజరు, భిక్షం, దాసరిమల్లి, వెంకన్న పాల్గొన్నారు.
చిట్యాల:పట్టణప్రగతి,హరితహారంలో భాగంగా పట్టణంలో గల నాలుగో వార్డు కౌన్సిలర్ జమాండ్ల జయమ్మ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన షాదీఖానలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో సీసీరోడ్లు నిర్మించాలని, ఇండ్లపై కప్పు నుండి విద్యుత్ వైర్లు తొలగించాలని,వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని, పార్కు, షాదీఖానకు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.స్పందించిన ఎమ్మెల్యే రూ.25 లక్షలతో వాటర్‌ప్లాంట్, డ్రయినేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. షాదీఖాన మరమ్మతులు త్వరలో చేపడ్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, వైస్‌చైర్మెన్, మార్కెట్ చైర్మెన్ జడల ఆదిమల్లయ్య, కమిషనర్ రాందుర్గారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.