Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మానవాళి ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది సోషలిజం వ్యవస్థ ఏర్పడడంతోనే అది సాధ్యం అవుతున్నదని, అది ప్రపంచంలో జరిగిన అనేక సంఘటనలు వాటిని నిరూపించాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి స్పష్టంచేశారు.ఆ పార్టీ జిల్లా స్థాయి విస్తత సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన పట్టణంలోని ఎస్వీ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విలయతాండవంలో అనేక సామ్రాజ్యవాద దేశాలు అల్లడిపోయాయని కానీ కమ్యూనిస్టు దేశాలు మాత్రమే తట్టుకొని నిలబడి క్యూబా లాంటి దేశాలు ప్రపంచ దేశాలకు వైద్యులను అందించిన పరిస్థితిని మనం చూశామన్నారు.మనదేశంలో కూడా కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచి వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాసిందన్నారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్లకాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు మానవాళి జీవితాలను తిరోగమనంలోకి నెట్టివేశాయన్నారు.దానికి ఉదాహరణ నల్లధనం వెనకకు తెస్తానని చెప్పి నోట్లు రద్దు చేసి ఏమి సాధించలేదన్నారు.ఫలితంగా అనేక మంది మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టి ఒక్క రూపాయి కూడా వెనకకు తేలేదన్నారు.రైతులను కాపాడుతానని వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కిస్తానని చెప్పి రైతులను కార్పొరేట్ల దగ్గర కూలీలుగా మార్చే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు దాసోహం చేసే రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులకు అన్యాయం చేసే దుర్మార్గపు పాలనకు మోడీ తెరతీశారన్నారు.ఆ చీకటిచట్టాలు రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా దానిని పెడచెవిన పెట్టి రైతు వ్యతిరేక విధానాలను తీసుకొని ముందుకు పోతున్నారని తెలిపారు. అడ్డూఅదుపూ లేకుండా గ్యాస్,పెట్రోల్,డీజిల్,నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేసేవిదంగా పాలన కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా ప్రభుత్వరంగసంస్థలు ప్రయివేట్ వారికి ధారాదత్తం చేయడానికి పూనుకున్నారని తెలిపారు.ఆయనకు తోడుగా రాష్ట్రంలో రాష్ట్రప్రభుత్వం కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ముందుకు పోతుందని విమర్శించారు.కరోనా కట్టడిలో విఫల మైందన్నారు.ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల పరిపాలన విధానాలను ఎండగట్టడానికి పార్టీ నిర్వహించే మహాసభలు వాటికి వేదిక కావాలన్నారు.గ్రామశాఖ,మండల,జిల్లా మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రజా ఉద్యమాల నిర్వహణకు పార్టీశ్రేణులు, సానుభూతిపరులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, గౌతమరెడ్డి, రవినాయక్, పగిడోజు రామూర్తి,పాదూరి శశిధర్‌రెడ్డి, వినోద్,అంజద్, పాతని శ్రీను, గొర్ల ఇంద్రారెడ్డి, పాపానాయక్ పాల్గొన్నారు.