Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
డిండి ఎత్తిపోతలపథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌కు 2015సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి ఆరేండ్లవుతున్నా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ,పునరావాస ప్రక్రియగాని కొనసాగించ లేకపోవడం బాధాకరమని నర్సిరెడ్డిగూడెం గ్రామాల ప్రజలు శుక్రవారం అధికారులు నిర్వహించిన గ్రామసభలో ఆందోళన వ్యక్తం చేశారు.7లక్షలా 61 వేల ప్యాకేజీతో పాటు 240 గజాల ఇంటి స్థలం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఉప్పరిగూడలో కేటాయించాలని కోరారు.18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం,పునరావసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండానే గ్రామసభలు, సమావేశాలు నిర్వహించడం సరికాదని నిర్వాసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే పోలీస్ పహారాలో పని చేయించడం బాధాకరమని వాపో యారు.గ్రామ కంఠానికి తక్కువపరిహారం ఇస్తామంటే సహించేది లేదని తేల్చిచెప్పారు.కేసీఆర్ చింతమడకకు ఇంటికి రూ.10 లక్షలు, బర్రెలు, గొర్రెలు ఇప్పించవచ్చు కానీ సర్వం కోల్పోతున్న తమకు తక్షణపరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.అధికారులకు ప్రభుత్వానికి నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇబ్బందులకు గురి చేయరని, గ్రామంలోని 169 ఇండ్లకు నోటిఫికేషన్ వచ్చిందని అధికారులు మాత్రం 144 పేర్లే చెబుతుండడం మిగతా 25 కుటుంబాల పేర్లు లిస్టులో తారుమారవడం బాధాకరమని బాధితులు వాపోయారు.తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు అధికారులు ఇక్కడి నుండి వెళ్ళవద్దని గ్రామస్తులు అదికారులను అడ్డుకొని నిలదీశారు.ఎవరిపేరైనా, ఏమైనా లిస్టులో లేకపోయినా సవరణలు చేసుకోవాలనుకుంటే మరో అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.ప్రజల డిమాండ్లను ఉన్నత అధికార ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని అధికారులు వెనుదిరిగారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీవో గోపిరామ్నాయక్, ఎంపీపీ మెంండు మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్,ఎంపీడీఓ రమేశ్దీన్దయాల్, నాంపల్లి సీఐ జి.సత్యం, సర్పంచ్ చిట్యాల సబితయాదగిరిరెడ్డి, ఎంపీఓ ఝాన్సీ పాల్గొన్నారు.