Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
పల్లెప్రకతివనంలో ఔషధమొక్కలు పెంచడం అభినందనీయమని అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ కొనియాడారు.మండలపరిధిలోని గోపలాయపల్లి, ఎనుగుల దొరి గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు.నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శించారు.ఎనుగులదొరి గ్రామంలో పల్లె ప్రకతివనంలో పూలు,పండ్లు సహజమొక్కలతో పాటు ఔషధమొక్కలు నాటడడాన్ని ఆయన పరిశీలించి సర్పంచ్ మహేశ్వరం సతీష్, పంచాయతీ కార్యదర్శి వేముల అంజలిని అభినందించారు.ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.వాతావరణ సమతుల్యత పరిరక్షణ,పచ్చదనం పెంపొందించేందుకు గ్రామంలో రహదారి కిరువైపులా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.గ్రామంలో మండల,గ్రామ అధికారులతో కలిసి వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.పారిశుధ్యంపై దష్టి పెట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.నర్సరీలను, కంపోస్టుషెడ్ను సందర్శించారు.అధికారులకు చెత్త తొలగింపుపై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివరావు, మండల పంచాయతీ అధికారి బొమ్మ సత్యనారాయణ, గోపలాయపల్లి సర్పంచ్ గోసుల భద్రాచలం, ఎంపీటీసీ పాశం శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేకాధి కారులు మంగమ్మ, ఉపసర్పంచ్ యాట సైదులు, కార్యదర్శి ఆంజనేయులు, వార్డుసభ్యులు మచ్చ నరేష్, కేతారపు గోవర్ధన్, కుక్కట్ల గోపాల్, దార మంజుల, గుండాల జితేందర్‌రెడ్డి, గాలి ఆంజనేయులు, ఫకీర్ లింగారెడ్డి, గోసుల సుదర్శన్,అల్లె లచ్చయ్య, గోసుల భద్రాచలం, గోసుల రాఘవేంద్ర,రేషన్‌డీలర్ సందీప్, అంగన్వాడీి టీచర్ అనురాధ, ఆశావర్కర్స్ అరుణ, కరుణ పాల్గొన్నారు.