Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
వ్యవసాయ పరికరాల అద్దెకేంద్రం ఏర్పాటుతో మహిళా సంఘాలు మరింత బలోపేతం కానున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.శుక్రవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఆవరణలో శ్రీ నిధి ఆర్థిక సహకారంతో రూ.18.30లక్షలతో ఏర్పాటు చేసిన రైతు మిత్ర, వ్యవసాయపరికరాల అద్దెకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ బ్యాంకులు, శ్రీ నిధి ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.వివిధ రకాల కార్యక్రమాలలో భాగంగా చిన్నతరహా వ్యాపార మార్కెటింగ్ కొనుగోలుకేంద్రాలతో పాటు వ్యవసాయ పరికరాల మధ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.డీఆర్డో పీడీ కాళిందిని మాట్లాడుతూ ప్రతి మహిళాసంఘం సభ్యులు క్రమంతప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం 46 సంఘాలకు రూ.3.14 కోట్ల బ్యాంకు రుణాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ధనలక్ష్మీనగేష్గౌడ్, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, వైస్‌చైర్మెన్ మురారిశెట్టి ఉమారాణి కష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, డిఆర్డిఎ ఎపిడి సరస్వతి, డి పి ఎం వెంకట్ రెడ్డి, వెంకటేశం, రామలింగం, ఏ పీ ఎం పి ప్రభాకర్, శ్రీనిధి ఆర్ ఎం. దుర్గాప్రసాద్, మేనేజర్ రమాదేవి ,వెంకట్‌రెడ్డి,ఎంఎస్ అధ్యక్షురాలు జ్యోతి, సమభావన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.