Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్లైఓవర్బిడ్జిలను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని ఖుదావన్‌పూర్ గ్రామంలో దీర్ఘకాలికంగా ఇబ్బందిపడుతున్న రైతుల కోసం ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ కాలువపై సుమారు రూ.42 లక్షలతో నిర్మించే ఫ్లైఓవర్ బిడ్జి నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.దొనకల్, కొండారం, గుండ్లపల్లి గ్రామాల్లో మొక్కలు నాటి పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మండలపరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీటీసీలు రాజుపేట మల్లేశం, ఇరిగి సహదేవ, పీఏసీఎస్ నల్లగొండ డైరెక్టర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, తవిటికృష్ణ, గాదె రాంరెడ్డి, బడుపుల శంకర్, బీరం గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
చెన్నుగూడెంలో పల్లెప్రగతి
నల్లగొండ మండలం చెన్నుగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుండెబోయిన శ్రీలత అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.10 రోజుల్లో ఏఏ పనులు చేయాల్లో నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి పల్లెప్రగతి నివేదికను గ్రామసభ ముందు ఉంచి చదివి వినిపించారు.అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుంగుల మధుసూదన్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ సోమయ్య, టీఆర్ఎస్ నాయకులు గుండెబోయినజంగయ్య, ఉపసర్పంచ్ ఆవుల అంజయ్య పాల్గొన్నారు.
మునుగోడు:అందరి భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి,పల్లె సీమలను ఆకుపచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేక అధికారి హుస్సేన్‌బాబు అన్నారు.శుక్రవారం మండలంలో నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గుడాపూర్,పులిపలుపుల,సింగారం,రతిపల్లి తదితర గ్రామాల్లో మండలఅభివద్ధి అధికారి యాకుబ్నాయక్తో కలిసి పర్యటించారు.అనంతరం మాట్లాడుతూ పల్లెలలో గుణాత్మకమైన మార్పు రావాలనే ధృడసంకల్పంతో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సుమలత, సర్పంచ్ గుర్రాల పరమేష్, గ్రామ ప్రత్యేకఅధికారి నర్సింహ,గ్రామ కార్యదర్శి వేణు, ఉపసర్పంచ్ వెంకట్‌రెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
మర్రిగూడ :మండలకేంద్రంతో పాటు పలు గ్రామాలలో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను బిగించారు.గ్రామాల్లో మళ్లీ విద్యుత్ సమస్యలు పునరావతం కాకుండా సరి చేయడం జరుగుతుందని మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ప్రత్యేకాధికారి అంజయ్య, ఎంపీడీఓ రమేశ్దీన్దయాల్, విద్యుత్ ఏఈ రాజేష్, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీఓ ఝాన్సీ, లైన్మెన్ వెంకన్న, కార్యదర్శి యూసుఫ్ పాల్గొన్నారు.
పచ్చనిచెట్టు.. ప్రగతికి మెట్లు
త్రిపురారం: మండలంలోని బెజ్జికల్, మర్రిగూడెం, మాటూర్ గ్రామాల్లో పల్లెప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే నోముల భగత్ ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ఆరు మొక్కలు పంపిణీచేశారు.పల్లెప్రకృతివనాన్ని సందర్శించారు.ఉప ఎన్నికల్లో ఇచ్చినహామీ మేరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు.అనంతరం దళితవాడలో పర్యటించి కరెంట్, సీసీరోడ్లు,డ్రయినేజీ, కరెంట్ స్తంభాలు, గ్రామాల్లోని సమస్యలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రనాయక్, మార్కెట్ చైర్మెన్ కామెర్ల జానయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బహునూతల నరేందర్, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పీఏసీఎస్ జిల్లా డైరెక్టర్ జైరామ్నాయక్, మాజీ ఎంపీపీ ధూళిపాల రామచంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు ధన్‌సింగ్‌నాయక్, యూత్ అధ్యక్షుడు చారి, త్రిపురారం సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మడుపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కట్టంగూరు:స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి బాటన పయనిస్తున్నాయని చిరుమర్తి లింగయ్య అన్నారు.పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠదామం, పల్లె ప్రకతి వనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తరాల బలరాములు, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలశౌరి, పీఏసీఎస్ చైర్మెన్ నూక సైదులు, సర్పంచ్ మేడ రేణుక, ఎంపీటీసీ వల్లపు నాగమణి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో పోరండ్ల సునీత, తహసీల్దార్ ఇంద్రవల్లి హుస్సేన్,ఎంపీఓ అతర్ పర్వేజ్, పంచాయతీరాజ్ ఏఈ జమీలుద్దీన్, ఏ పీఓ గుంటుకవెంకటేశం, ఏపీఎం చేగోని వినోద, మండల విద్యుత్ ఇంజనీర్ నోములసురేష్, మండల వ్యవసాయాధికారి ఎస్ .శ్రీనివాస్, పశువైద్యాధికారి మూడుదుడ్ల రాంప్రసాద్, గ్రామనోడల్ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఈపూరి రవీందర్ పాల్గొన్నారు.