Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో నిందితుడు
నవతెలంగాణ-దేవరకొండ
137 కిలోల గంజాయి పట్టుబడ్డ సంఘ టన పట్టణంలోని గాంధీనగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.ఎక్సైజ్ సీఐ జి.వెంకటేశ్ శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చందంపేట మండలపరిధిలోని బొల్లారం తండాకు చెందిన రమావత్ మాతనాయక్ దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.ఈ క్రమంలో గురువారం రాత్రి మాత బైక్పై తాను నివాస ముంటున్న ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా అక్కడ్నుంచి పరార య్యాడు. ఎక్సైజ్ అధికారులు సదరు వ్యక్తి అద్దెకుంటున్న ఇంటిని సోదా చేయగా ఇంట్లో 50 కిలోల బస్తాల్లో నిల్వ ఉంచిన 137 కేజీల గంజాయి పట్టు బడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.8.22 లక్షలు ఉంటుంది.కేసు నమోదు చేశారు.