Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ - చివ్వేంల
రైతులు లాభదాయకమైన పంటలను సాగు చేయాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిధి లోని భీమ్లా తండాలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు క్షేమంగా ఉండాలని ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకూ కాళేశ్వరం జలాలను అందిస్తుందన్నారు. రైతులు లాభదాయకమైన మిర్చి, కంది, పత్తి, వివిధ రకాల కూరగాయలు సాగు చేసుకొని అధిక లాభాలు పొందాలని సూచించారు. తెలంగాణలో పండిన పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా కూడా రైతులు మంచి ఆదాయం పొందొచ్చ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధారావత్ కుమారి బాబు నాయక్, జెడ్పీటీసీ భూక్య సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ రంగారావు, సర్పంచ్ హాముడా, జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, మండల వ్యవసాయ అధికారి ఆశాకుమారి పాల్గొన్నారు.