Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అజరురెడ్డికి అశ్రునివాళ్లు
- శోకసంద్రంలో మునిగిన ఇప్పగూడెం
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, ఇప్పగూడెం సర్పంచ్ మంతెన అజరురెడ్డి ఆశయాలను కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మండలంలోని ఇప్పగూడెంలోని మంతెన నారాయణరెడ్డి స్మారక భవన్ (సీపీఐ(ఎం) కార్యాలయం)లో శుక్రవారం అజరురెడ్డి భౌతికకాయాన్ని సంద్శనార్ధం ఉంచారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి రాములు, సూడి కష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు రాపర్తి సోమయ్య, గట్ల కొండల్‌రెడ్డి, బొట్ల శేఖర్, సింగారపు రమేష్, బూడిద గోపి, కావటి యాదగిరి, ఎన్నకూస కుమార్, సాదం రమేష్, మండల కన్వీనర్ మునిగెల రమేష్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా, కొడేపాక యాకయ్య, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, తదితరులు నివాళ్లర్పించారు. అనంతరం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి గట్ల మల్లారెడ్డి అధ్యక్షతన సంతాప సభ నిర్వహించగా తమ్మినేని మాట్లాడారు. ఆదర్శ కమ్యూనిస్టు నేతగా ప్రజాహృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న మంతెన నారాయణరెడ్డి ఆశయాలకు అనుగుణంగా అజరు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటు పడ్డారని చెప్పారు. సొంత డబ్బులతో వైద్యశాల, గ్రంథాలయం నెలకొల్పారని ఎంఎన్ స్మారక ట్రస్టు ద్వారా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య మాట్లాడుతూ సంకిష్టమైన రాజకీయ పరిస్థితుల మేరకు సవాళ్లను ఎదుర్కొవాల్సిన ప్రస్తుత తరుణంలో అజరురెడ్డి లాంటి నాయకత్వం లేకపోవడం బాధాకరమన్నారు. అజరు చూపిన బాటలో నడవాలని సూచించారు. వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడారు. అజరురెడ్డి అందించిన సేవలను స్మరించారు.