Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, భూమి,భుక్తి విముక్తి కోసం పోరాడిన మహాయోధుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం జిలా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య75వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నాగార్జున్‌రెడ్డి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా,పీడనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు.విసునూరు దేశముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశాడని పేర్కొన్నారు.ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో రజాకార్లకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని వెట్టిచాకిరి నశించాలని పోరాటం చేశారన్నారు.దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటం విజయ వంతమైందని పేర్కొన్నారు.కమ్యూనిస్టుల పోరాటంతోనే పేదలకు లక్షలాది ఎకరాల భూమి పంచారన్నారు.ఆనాటి పోరాటయోధులస్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలపై ఉద్యమాలను ఉధతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాడాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి,ఎల్గూరి గోవింద్, వేల్పులవెంకన్న, మేకనబోయినశేఖర్, జె.నర్సింహారావు, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, నాయకులు కొప్పులరజిత, మామిడి సుందరయ్య, సాయికుమార్, నర్సయ్య పాల్గొన్నారు.