Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 75వ వర్థంతి సందర్భంగా అదివారం పట్టణంలో గల దొడ్డి కొమురయ్య విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడివెండి గ్రామం విస్నూర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అసువులుబాసిన దొడ్డి కొమురయ్య మరణం యావత్ తెలంగాణ అగ్ని కణంగా మారి భూస్వామ్య దేశముఖ్ వ్యతిరేకంగా వేలాది గ్రామాలు ఐక్యమై సాయుధ పోరాటం కొనసాగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రావణ్ కుమార్ వీరస్వామి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి వెంకటేశ్వర్లు ,పట్టణ కార్యదర్శి రమేష్ ప్రజా సంఘాల నాయకులు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్ గోవర్ధన్ సొల్లేటి ప్రభాకర్ పర్వతాలు ఎల్ బి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాటం భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం, నిజాం నవాబు రజాకార్లకు వ్యతిరేకంగా, పటేల్, పట్వారీ దోపిడీదారులకు వ్యతిరేకంగా మహత్తరంగా జరిగిందని అందులో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని సీపీిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. ఆదివారం స్థానిక శ్రామిక భవనంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, తొలి అమరుడుదొడ్డి కొమరయ్య 75వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బొమ్మిడి నగేష్ కల్లూరి అయోధ్య, కుంచం వెంకన్న జానపాటి శంకర్, కత్తుల చంద్రశేఖర్, చారి, నరసింహ, అక్కినపల్లి అంజి, శంకర్, టోపీ రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 75 వ వర్థంతి కార్యక్రమాన్ని జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లోడంగిగోవర్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య సర్కిల్ అర్జాలభావి బస్ స్టాప్ నందు ఆదివారం నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమాకి ముఖ్య అతిథిగా నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తన ప్రాణ త్యాగం చేసిన గొప్ప విరుడని నేటి యువత వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి,వైస్ చైర్మెన్ అబ్బాగొని రమేష్, పిల్లి రామరాజు యాదవ్ పంకజ్ యాదవ్,పర్వతాలు, ల్ వి యాదవ్, వంగూరు నారాయణ యాదవ్ మోదాల సోమలింగయ్య యాదవ్,మామిడి పద్మ, కౌన్సిలర్స్ గోగు శ్రీనివాస్ యాదవ్,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్,అల్లి సుభాష్ యాదవ్,మేకల యాదన్న యాదవ్, లక్మి నారాయణ దుడుకు, శ్రవణ్,అంబటి వెంకన్న, రామన్న యాదవ్,సత్యనారాయణ యాదవ్,బి.వెంకన్న యాదవ్,శరత్చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : ప్రభుత్వ భూములన్నీ ప్రజల సొత్తు అని వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మడానికి వీలు లేదని ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం దొడ్డి కొమురయ్య 75 వర్థంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి దొడ్డి కొమురయ్య ఆత్మబలిదానం భూమి సమస్యను ముందుకు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి లింగారెడ్డి, సత్యనారాయణచారి, తిరుగుడు రవి,కుమార్ యాదవ్,నేరడు లింగయ్యయాదవ్, ప్రవీణ్ ప్రజాపతి, శ్రీనివాస్ గౌడ్, కట్టెల శ్రీరాములు, భిక్షం, రవి పాల్గొన్నారు.