Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరత్వం ఉద్యమానికి ఊపిరి పోసిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ ప్రజాభవన్‌లో కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భూక్తి కోసం, బానిస బంధాల నుంచి విముక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు.ఆయన స్ఫూర్తితో ఉద్యమాలకు చేయాల్సిన అవసరం నేడు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ డిండి మండల కార్యదర్శి తూం బుచ్చిరెడ్డి, మండల నాయకులు ఎమ్‌డి.మైనోద్దీన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు, పగిళ్ల బుచ్చయ్య, అలమోని మల్లయ్య, తోటపల్లి నగేష్, జూలూరి జ్యోతిబస్, జక్క కష్ణారెడ్డి, శ్రీరామదాసు బ్రహ్మచారి, పెరుమాండ్ల లాలయ్య, రఘుమారెడ్డి, పాత్లవత్ బద్రు, రాజు, బక్కయ్య, కపిల్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ:వీరతెలంగాణ రైతాంగ సాయుధపోరాట తొలివీరుడు దొడ్డి కొమురయ్య వర్థంతిసభను ఆదివారం మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, ఏఐఎఫ్‌డీడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ, ఏఐఎఫ్‌డీవై జిల్లా కార్యదర్శి గోపి, జిల్లా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ 75 ఏండ్ల కింద తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన కొనసాగేదన్నారు.ఈ పాలనకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన వీర తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభ మైందన్నారు.ఈ కార్యక్రమంలో జనార్దన్, కమలమ్మ, మల్లయ్య, ఆమని పద్మ పాల్గొన్నారు.
మునగాల : అమరవీరుల స్మారకభవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వ ర్యంలో దొడ్డి కొము రయ్య వర్థంతిసభ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ సైదా, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, చందాచంద్రయ్య, ఆరె రామకష్ణారెడ్డి,వీరబోయిన వెంకన్న, బచ్చలకూర స్వరాజ్యం, సోంపంగు జానయ్య ,గడ్డం వినోద్ పాల్గొన్నారు.
నూతనకల్: తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని సీపీఐఎం మండల కార్యదర్శి శంకర్‌రెడ్డి అన్నారు మండలకేంద్రంలోని కామ్రేడ్ స్మారకభవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండలకార్యదర్శి బొజ్జ శ్రీను, కూసు బాలకష్ణ,బత్తులసందీప్, తిరుమలేష్, బత్తులసోమయ్య పాల్గొన్నారు.
కోదాడరూరల్ :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 75వ వర్ధంతి సీపీఐఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హమాలీ అడ్డా వద్ద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కాటయ్య, వెంకన్న, రాములు, సైదులు, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, చంద్రయ్య పాల్గొన్నారు.