Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ మహేందర్ రెడ్డి
- ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్
నవతెలంగాణ -నల్లగొండ
బక్రీద్ పర్వదినంతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించే బోనాల పండుగల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం డీజీపీ కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగలో సైతం ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయాలకు రావడం, బోనాలు సమర్పించడం జరుగుతుందని రెండు పండుగలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు పండుగల సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టింగులు పెట్టే వారిని గుర్తించి అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నల్లగొండ ఎస్పీ ఏవి.రంగనాథ్ మాట్లాడుతూ రెండు పండుగల నేపథ్యంలో జిల్లాలో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని, పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దష్టి పెట్టడంతో పాటు జిల్లా సరిహద్దుల వద్ద, ప్రధాన పట్టణాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆదనవు ఎస్పీ నర్మద, డీిఎస్పీలు రమణా రెడ్డి, రవీందర్, ఐటి సెల్ సీిఐ రౌతు గోపి, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.