Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని మండల విద్యుత్ ఏఈ భిక్షపతి గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ఆవరణలో నవతెలంగాణ విలేకరితో ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం సీజన్లో లూజ్ లైన్లు సరి చేయడం కోసం పోల్స్ నాటడానికి జిల్లా విద్యుత్ అధికారులకు గెజిట్ పంపామన్నారు. వ్యవసాయ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. గ్రామాలలో వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో ఓవర్‌లోడు పడుతుందన్నారు. 15 అదనపు ట్రాన్స్ ఫార్మర్స్ ఆలేరు మండలానికి కావాలని కోరుతూ ప్రతిపాదనలు పంపామన్నారు. పట్టణంలోని బస్టాండ్ పరిధి బీసీ కాలనీ కు ప్రత్యేకంగా ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు . మున్సిపాలిటీలో విద్యుద్దీపాలు పగలే వెలుగుతున్న విషయాన్ని ప్రతినిధి తెలుపగా స్విచ్ బోర్డులు, టైమర్లు మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గత పట్టణ ప్రగతిలో 100 సిమెంట్ పోల్స్ నాటామన్నారు. పట్టణ విస్తీర్ణంవేగంగా పెరుగుతున్నందున మరో 150 పోల్స్ అవసరం ఉన్న చోట నాటడానికి సిద్ధంగా ఉంచామన్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం బంతి కేబుల్ లేని చోట ఏర్పాటు చేస్తామన్నారు . వర్షాలు కురుస్తున్నందున రైతులు , ప్రజలు ఇనుప వైర్లపై బట్టలు ఆరవేయడం, విద్యుత్ స్తంభాల వద్దకు, ట్రాన్ఫాÛర్మర్ల వద్దకు, వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మండల, పట్టణ పరిధిలో విద్యుత్ లైన్లకు చెట్లు అనుకుని ఉన్న చోట తొలగిస్తున్నామన్నారు. పట్టణం లో విద్యుత్ సమస్యలు తలెత్తినట్టయితే ఫోర్‌మెన్ రవీందర్ నాయక్ , లైన్మెన్లు యాదగిరి ,రమేషు, రమేష్మార్, రాములు, నర్సింహారెడ్డి ,బహదూర్‌పేటలో నాగరాజు, సాయిగూడెంలో నర్సింహులు విద్యుత్ వినియోగదారులకు , రైతులకు, అందుబాటులో ఉంటారన్నారు. మండలంలోని గ్రామాల పరిధి లో గొలనుకొండ బాలరాజు, శరాజీపేట ఇబ్రహీం, టంగుటూరు తనీషు గౌడ్, కొల్లూరు జానకిరామ్, పటేల్‌గూడెం సత్తయ్య ,గుండ్లగూడెం ఎండి.జహంగీర్, జేఎల్ఎం బాలకష్ణ ప్రజలకు వినియోగదారులకు, రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని కోరారు.