Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ - మఠంపల్లి
ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి సూచించారు. మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామంలో మెగా పల్లె ప్రకృతివనం పనుల కోసం సర్వే నెంబర్ 558లో గల ప్రభుత్వ స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఎంపీడీవో జానకీరాములు, ఆర్ఐ లక్ష్మణ్‌రావు, ఏపీవో ఉమ, ఎంపీటీసీ నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చిలుకూరు :జిల్లా వ్యాప్తంగా పదెకరాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సీతారామాపురంగుంటలో మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ ప్రశాంతికోటయ్య, ప్రత్యేకాధికారి సౌజన్య, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో ఈదయ్య, ఎంపీవో ముక్కపాటి, చిలుకూరు, సీతారామాపురం సర్పంచ్‌లు కొడారిబాబు, పులగం రవీందర్, సర్వేయర్ బిల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.