Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రుటిలో తప్పిన ప్రమాదం
- రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసం
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ట్రాన్స్ఫార్మర్ను ఢ కొట్టి ఇంట్లోకి కాలేజీ బస్సు దూసుకెళ్లిన సంఘటన సోమవారం తెల్లవారుజామున మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ బి యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం .. హైదరాబాద్ శివారులో గల విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బస్సు తమ సిబ్బందిని ని విధులకు హాజరు పరిచేందుకు తెల్లవారుజామున చౌటుప్పల్ నుండి బయలుదేరింది. నార్కట్ పల్లి నుండి నల్గొండ వెళ్లే దారిలోఎల్లారెడ్డిగూడెం చేరుకోగానే డ్రైవర్ పి.రాజయ్య అతి వేగంగా నడపడంతో పాటు నిద్ర మత్తులో ఉండటంతో బస్సు డివైడర్‌ను ఢకొీని, నార్కట్ పల్లి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీని రోడ్డుకి అవతల ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫాÛర్మర్ బలంగా ఢకొీట్టి పక్కనే ఉన్న శంకర్ ఇంట్లోకి దూసుకెళ్లింది .ఈ క్రమంలో డాన్స్ ఫార్మర్ కాస్త శంకర్ ఇంట్లో ఎగిరిపడింది . బస్సు బలంగా ఇంట్లోకి దూసుకెళ్లడంతో చుక్కల శంకర్ ఇంటి గేట్లు ప్రహరి ఇంటి లోపల ఉన్న కారు ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ద్విచక్ర వాహనంపై వస్తున్నా బట్ట శివ కృష్ణ దొడ్డు సినిమా తను శ్రీనివాస్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. కృష్ణ్ణ మామ కోక యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.