Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
నిరుపేదలకు సీఎం సహాయనిధి వరమని, లబ్దిదారులు ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని మోత్కూరు, ఆరెగూడెం, దాచారం, పాటిమట్ల గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్దిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.60 లక్షల చెక్కలను సోమవారం సింగిల్ విండో కార్యాలయంలో అందజేశారు. అనంతరం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనాలిక ట్రాక్టర్ షోరూంను డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, గజ్జి మల్లేష్, నాయకులు రచ్చలక్ష్మీనర్సింహారెడ్డి, జంగ శ్రీను, దబ్బెటి రమేష్, దండెబోయిన మల్లేష్, అండెం రాజిరెడ్డి, మజీద్, ఎం.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.