Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి మండలంలోని 21మందిలబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణి చేశారు. పల్లె ప్రగతిలో ఐదో రోజు రక్షకభట నిలయం గుండాల లో మొక్కలు నాటారు .నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రామారం గ్రామానికి చెందిన బండి సుశీల మత్స్యపారిశ్రామిక సంఘం సబ్సిడీ ద్వారా పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా కోఆఫ్షన్ సభ్యులు ఎండి.ఖలీల్ జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీ,వైస్ ఎంపిపి మహేశ్వరం మహేందర్ రెడ్డి,ఎంపిడిఓ గార్లపాటి శ్రీనివాస్, తహసీల్దార్ ఉత్పల దయాకర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసిలు మందడి రామకష్ణా రెడ్డి, గడ్డమీది పాండరీ,టిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ ఆయా గ్రామాల సర్పంచ్లు ,తదితరులు పాల్గొన్నారు.