Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణాన్ని అభివద్ధి చేసి సుందరంగా తీర్చి దిద్దడానికి కట్టుబడి ఉన్నానని దీనికి ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని 3, 13, 14, 15, 16, 17, 18 ,19, 41వ వార్డుల్లో పట్టణ ప్రగతిలో భాగంగా పలుఅభివద్ధి కార్యక్రమాలకు ఎల్ఆర్ఎస్ నుంచి మంజూరైన సీసీరోడ్లు, డ్రయినేజీ పనులకు శంకుస్థాపనలు చేసి పలు కాలనీలలో మొక్కలు నాటి ప్రజలకు మొక్కల పంపిణీ చేశారు.ఇప్పటికే పట్టణంలో రూ.100 కోట్ల ప్రత్యేక అభివద్ధి నిధులు పనులు చేశామన్నారు.ఇటీవల ముఖ్యమంత్రి మంజూరు చేసిన మరో రూ.10 కోట్ల అభివద్ధి పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.పట్టణంలో ప్రధాన రోడ్ల వెడల్పు పనులు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపలచైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్‌చైర్మెన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, ఈఈ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, కౌన్సిలర్లు ఊట్కూరు వెంకటరెడ్డి,అభిమన్యూ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈనెల 9 న పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్రను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మండలంలోని దోమలపల్లి గ్రామంలో నిర్వహించనున్నట్టు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సాయంత్రం 5:00 గంటలనుండి గ్రామంలో అన్ని వార్డులలో, అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటన చేసి రాత్రి 9:00 గంటలకు భోజనంతరం.. గ్రామం లోనే అధికారులతో కలిసి నిద్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. 10న ఉదయం 5:30 గంటల నుండి మార్నింగ్‌వాక్, అల్పాహారానంతరం ఉదయం 8:00 గంటలకు రచ్చబండ గ్రామసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
చిట్యాల : మున్సిపాలిటీలోని 3వ వార్డులో బుధ వారం పట్టణ ప్రగతి కార్యక్రమం మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు చిట్యాలను మోడల్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రామ్‌దుర్గారెడ్డి, వైస్‌చైర్మెన్, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కష్ణ, నాయకులు జిట్ట బొందయ్య, సుకూర్ పాల్గొన్నారు.