Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం పట్టణంలోని గొల్లగూడ, గడియారం చౌరస్తాలో జాతీయ నాయకులు తీగల రత్నం మాదిగ, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగా, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకపల్లి నగేష్ మాదిగలు ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మలను ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం మందకష్ణ మాదిగ 57వ జన్మదినాన్ని మునిసిపాలిటీ కార్మికుడు పేర్ల సుధాకర్ చేతుల మీదుగా కేకు కట్ చేసి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ పట్టణ అధ్యక్షులు తీగల మల్లికార్జున్, జిల్లా కోశాధికారి గట్టు మల్లయ్య, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెరిక శ్రీనివాస్,ఎస్సీ, ఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, మహిళ జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, రెడ్డిమాస్ ఇందిర, మణమ్మ, జలందర్, పెరిక నర్సింహ, పెరిక యాదగిరి, కత్తుల సన్నీ, పెరిక మల్లేశం, తీగల యాదయ్య, కత్తుల మరయ్య, పందిరి గోపాల్, అమితేష్, బోగరి రవి, పందిరి శ్రీనివాస్, పగిళ్ళ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్రాంపల్లిలో ఘనంగా నిర్వహించారు.సంఘం జెండాను చిట్యాల మండలం ఇన్చార్జి బుస్సు శంకర్ మాదిగ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బుస్సు మధుసూధన్, రత్నం నర్సింహ్మ, దుబ్బ కుమార్, బుస్సు శ్రీనివాస్, బుస్సు శ్రీకాంత్, జిల్లా సత్యం, దుబ్బ విఘ్నేశ్వర్ , అంబాల ప్రవీణ్, కాసర్ల నరేష్, కత్తుల యాదయ్య, బుస్సు గిరి, మశ్చ్యగిరి, భాను తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్: పట్టణంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాష్ట్ర కో కన్వీనర్ కంది కంటి అంజయ్య, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోడ సునీల్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
చందంపేట: మండలకేంద్రంలోని పోలేపల్లి ఎక్స్‌రోడ్‌లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ ఎల్లేష్ మాదగ జెండాను ఎగురవేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల కిరణ్, దర్శనం శివ, బుడిగపాక గోవర్ధన్, ఆకులపల్లి విజరుమాదిగ, ఎలిమినేటి ఈశ్వర్మాదిగ, నాగిళ్ల విజరు, అందుగులనాగరాజు, నాగిళ్ల శివ, చాట్ల ప్రవీణ్, మధు పాల్గొన్నారు.